యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు - cji visiting yadadri temple
close
Updated : 15/06/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

యాదాద్రి: యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం బ‌య‌లుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య అర్చ‌కులు సీజేఐ దంప‌తుల‌ను పూర్ణ‌కుంభంతో ఆల‌యంలోకి స్వాగ‌తించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. దర్శనం తర్వాత ఆలయ నిర్మాణాలను సీజేఐ దంపతులు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని మంత్రులు, అధికారులు.. నిర్మాణాల విశిష్టతను ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి వారికి వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని