ఆక్సిజన్‌ కొరత రానివ్వొద్దు: జగన్‌ - cm jagan review on health department
close
Published : 03/05/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ కొరత రానివ్వొద్దు: జగన్‌

అమరావతి: వైద్య ఆరోగ్యశాఖకు ఎట్టిపరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వొద్దని సీఎం జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భూసేకరణపై కలెక్టర్లతో మాట్లాడాలని సూచించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల టెండర్లు పూర్తయ్యాయన్న అధికారులు.. మిగిలిన 12 కళాశాలలకు ఈ నెల 21లోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.  వైఎస్సార్‌ కంటివెలుగు పథకంపైనా సీఎం సమీక్షించారు. ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా చేసిన పరీక్షలు, అందించిన అద్దాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

ప్రైమరీ కాంటాక్టులను గుర్తించండి
కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పైనా సమీక్షించిన ముఖ్యమంత్రి.. పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ ఆంక్షలు విధించాలన్నారు. వ్యాపారులు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టులను గుర్తించాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని, ఆక్సిజన్‌ నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. కొవిడ్ కేర్‌ సెంటర్లలో 31, 843 పడకలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని, పెరంబదూరు, బళ్లారి నుంచి 400 టన్నుల ఆక్సిజన్‌ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. రవాణా కోసం ట్యాంకర్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నారు. మైలాన్‌ ల్యాబ్‌కు 8లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఆర్డర్‌ ఇచ్చామని సీఎంకు వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని