ఏపీలో కొవిడ్‌ ఆస్పత్రులకు రాయితీలు - cm jagan took importent decisicion on corona
close
Published : 20/07/2020 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొవిడ్‌ ఆస్పత్రులకు రాయితీలు

అమరావతి: కరోనా నివారణపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని నిర్ణయించారు. వైద్యులపై పనిభారం లేకుండా నాణ్యమైన సేవలందించాలని సూచించారు. జిల్లాల్లోని 84 కొవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఆ ఆస్ప్రతుల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ రాయితీలు అందించాలని సీఎం నిర్ణయించారు. కరోనా నివారణపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ ‘‘కరోనా అనుమానితులకు అవగాహన కోసం భారీ ప్రచారం చేయాలి. కొవిడ్‌ ఎవరికైనా వస్తుంది.. ఆందోళన వద్దు. 85శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతోంది. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులకు వైద్య సహాయంలో ఆలస్యం చేయవద్దు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాలి’’అని సీఎం జగన్‌ తెలిపారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని