close

తాజా వార్తలు

ప్రేక్షకులు మెచ్చే విలక్షణ నటుడు

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఇకలేరన్న వార్త విని యావత్‌ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు సహా పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. 

‘‘ప్రముఖ సీనియర్ నటులు, రచయిత, సంపాదకులు, గొల్లపూడి మారుతీరావు మృతి చెందడం ఎంతో విచారకరం ఆయన ఎంత మంచి నటులో, అంత గొప్ప రచయిత. సామాజిక కోణంలోనే ఆయన రచనలు ఉండేవి. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా  తన రచనల ద్వారా ,వ్యాఖ్యనాల ద్వారా చెప్పేవారు’’

-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

‘‘ నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి

‘‘గొల్లపూడి మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, సాహితీలోకానికి తీరని లోటు. నటుడిగా, రచయితగా ఆయన సేవలు ప్రశంసనీయం’’

-తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

‘‘నాకు ఇష్టమైన నటుల్లో గొల్లపూడి మారుతీరావుగారు ఒకరు. ఆయన మాట్లాడే విధానం. ఆయన నటన కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సర్‌’’

-నాని 

‘‘గొల్లపూడి మారుతీరావుగారి మృతి ఎంతో విచారం. చిత్ర పరిశ్రమకు మీరు అందించిన సేవలు అమోఘం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం’’

-గోపీ చంద్‌

‘‘హ్యాపీడేస్‌’ కన్నా ముందు నటుడిగా సహాయ దర్శకుడిగా  ఆయనతో పనిచేశా. ఆయన చేసిన సూచనలు, మార్గదర్శకత్వం ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్‌. అద్భుతమైన చిత్రాలతో మీరెప్పుడు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు గొల్లపూడి మారుతీరావుగారు’’

- నిఖిల్‌

‘‘గొల్లపూడి మారుతీరావుగారు ఇకలేరన్న వార్త ఎంతో విచారాన్ని కలిగించింది. విలక్షణ నటుడు అన్న పదానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’

-సుధీర్‌బాబు

‘‘రచయితగా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు మీరందించిన సేవలు అమోఘం. నటులు, రచయితలు, దర్శకులు అదే విధంగా ప్రజలు ఎవరూ మిమ్మల్ని మర్చిపోలేరు’

- గుణ టీమ్‌ వర్క్స్‌

‘‘ఆయనో అద్భుతమైన రచయిత, నటుడు’’

-మెహర్‌రమేష్‌



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.