TS news: మంత్రి జగదీశ్‌రెడ్డి-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం - conflict between minister jagadish reddy and mla rajagopal reddy
close
Published : 27/07/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS news: మంత్రి జగదీశ్‌రెడ్డి-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోంచి ఆయన మైక్‌ లాక్కోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్‌, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడం గందరగోళానికి దారి తీసింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట చోటు చేసుకుంది. 60 ఏళ్లలో ఏమీ చేయలేని కాంగ్రెస్‌ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని