‘బ్రహ్మాస్త్ర’ విడుదల ఎప్పుడు? - confuession in brahmastra release date
close
Published : 20/03/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బ్రహ్మాస్త్ర’ విడుదల ఎప్పుడు?

ముంబయి: బాలీవుడ్‌ నుంచి వరసగా విడుదల తేదీలు ప్రకటనలు వస్తున్నాయి. గత ఏడాది రావాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా ఆగిపోయిన భారీ చిత్రాలన్నీ ఈ ఏడాది బెర్తులు ఖాయం చేసుకుంటున్నాయి. కానీ ‘బ్రహ్మాస్త్ర’ విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రణ్‌బీర్‌ కపూర్, అలియాభట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే పలు సినిమాలు కీలకమైన పండగల్లో తమ సినిమాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వాటి మధ్యలో తమ సినిమాను విడుదల చేయడం కంటే సోలోగా విడుదల చేయడం కోసం చిత్ర దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. నవంబరు 26 కానీ డిసెంబరు 10న కానీ ‘బ్రహ్మాస్త్ర’ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుఖ్‌ఖాన్‌ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని