గర్జించిన టీమ్‌ఇండియా ‘యంగ్‌ గన్స్‌’ - congratulations to teamindia
close
Updated : 07/03/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గర్జించిన టీమ్‌ఇండియా ‘యంగ్‌ గన్స్‌’

కోహ్లీసేనపై ప్రశంసల జల్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికైన టీమ్‌ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒత్తిడిలో భారత జట్టు అద్భుతంగా ఆడిందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభినందిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షా, గౌతమ్‌ గంభీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సచిన్‌ తెందూల్కర్‌ సహా అనేక మంది ట్వీట్లు చేశారు. కోహ్లీసేన సభ్యులు సైతం 3-1తో సిరీస్‌ విజయాన్ని ఆనందిస్తున్నామని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

టెస్టు సిరీస్‌ గెలిచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్న టీమ్‌ఇండియాకు అభినందనలు. సుదీర్ఘ కాలంగా బుడగలో ఉంటూ ఇలాంటి నాణ్యమైన క్రికెట్‌ ఆడటం గొప్ప విషయం. ఐదు నెలలుగా మీ ప్రదర్శన అద్భుతంగా ఉంది-  సౌరవ్‌ గంగూలీ

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరిన కోహ్లీసేనకు అభినందనలు. మీరు జాతికి ప్రేరణగా నిలిచారు. కఠిన పరిస్థితుల్లో తలెత్తుకునేలా చేశారు. జూన్‌లో ఇంగ్లాండ్‌కు వెళ్లి రాణించాలని కోరుకుంటున్నా - జే షా

విజేతలు రాత్రికి రాత్రే తయారవ్వరు. వారు కొద్దిమంది మీదే ఆధారపడరు. గడ్డు పరిస్థితుల్లో తిరిగి పుంజుకోనే సామర్థ్యాన్ని వారు నిర్వచిస్తారు. వెనుకబడ్డా పుంజుకొనే అలవాటు చేసుకుంది టీమ్‌ఇండియా. సమగ్రమైన, తెలివైన జట్టిది - వీవీఎస్‌ లక్ష్మణ్‌

సూపర్‌ విజయం! యంగ్‌ గన్స్‌ గర్జించాయి! టీమ్‌ఇండియాకు అభినందనలు - గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ఇండియా అందమైన విజయమిది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరుకున్నందుకు అభినందనలు. సిరీస్‌ సాంతం ప్రతి విభాగంలోని ప్రతి ఒక్క ఆటగాడు రాణించడాన్ని ఆస్వాదించాను. ప్రత్యేకించి రిషభ్ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, రోహిత్‌ - సచిన్‌ తెందూల్కర్‌

టెస్టు సిరీసులో మనోహరమైన విజయం అందుకున్న టీమ్‌ఇండియాకు అభినందనలు. ఇంగ్లాండ్‌ ఓటమి పాలైంది అహ్మదాబాద్‌లో కాదు తమ మనసుల్లో (మెదడు చిత్రం పెట్టాడు) - వీరేంద్ర సెహ్వాగ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని