ఫలితాలు రాకముందే.. కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి! - congress candidate in tamilnadu died due to corona after assembly elections
close
Published : 11/04/2021 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫలితాలు రాకముందే.. కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి!

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి వారం రోజులు కూడా గడవకముందే విషాదం చోటుచేసుకుంది. శ్రీవిల్లిపుత్తూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి మాధవరావు మరణించారు. గత నెలలో కరోనా వైరస్‌ బారిన పడిన మాధవరావు.. తాజాగా మళ్లీ ఆ వ్యాధి సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆ పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సంజయ్‌ దత్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

‘కాంగ్రెస్‌ నాయకుడు, శ్రీవిల్లిపుత్తూర్‌ పార్టీ అభ్యర్థి మాధవరావు మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సంజయ్‌దత్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికల పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీవిల్లిపుత్తూర్‌లో ఒకవేళ మాధవరావు విజయం సాధిస్తే ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని