సంక్షోభంలో పుదుచ్చేరి ప్రభుత్వం? - congress government in puducherry slips into minority ahead of polls
close
Updated : 16/02/2021 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షోభంలో పుదుచ్చేరి ప్రభుత్వం?

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కు దిగువకు చేరింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కాగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించేందుకు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ బుధవారం పుదుచ్చేరికి రానున్న నేపథ్యంలో వీరి రాజీనామాలు చోటుచేసుకోవడం గమనార్హం. 

నమశివాయం, తీప్పయింజన్‌ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. మిగితా ఇద్దరిలో ఒకరు సోమవారం, మరొకరు ఈరోజు తాజాగా రాజీనామా చేశారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మూడు నామినేటెడ్‌ స్థానాలు. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా..  కాంగ్రెస్‌ 15 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కిచేరింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని