విపక్ష నేతలకు కరోనా అంటించే కుట్ర: భట్టి - congress leaders fires on kcrbjp
close
Published : 28/07/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపక్ష నేతలకు కరోనా అంటించే కుట్ర: భట్టి

మాకు వైరస్‌ సోకితే కేసీఆర్, డీజీపీలదే బాధ్యతన్న కాంగ్రెస్‌ నేత

హైదరాబాద్‌ : విపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను అంటించే కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారు అని.. ఏ స్థాయికైనా దిగజారుతారని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్. ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు. పోలీసు స్టేషన్‌లో, పోలీసు వాహనాల్లో శానిటైజ్‌ చేయడం లేదు. నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదు. పోలీసులు అరెస్టు చేసే ముందు వాహనాలను శుభ్రపరిచి అందులో తీసుకెళ్లాలి. పోలీసు వాహనాల ద్వారా మా నాయకులకు ఎవరికైనా కరోనా సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలదే బాధ్యత. పోలీసుల వాహనాల్లో కార్యకర్తలు గుడ్డిగా ఎక్కొద్దు’అని భట్టి విజ్ఞప్తి చేశారు.

‘దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. భారత రాజ్యాంగాన్ని భాజపా అపహాస్యం చేస్తోంది. గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్.. ఇవాళ రాజస్థాన్‌లో రాజకీయ కుట్రలకు తెర లేపింది. రాజస్థాన్ గవర్నర్ దిల్లీకి దాసోహం అయ్యారు. దిల్లీ నేతల డైరెక్షన్‌లో ఆయన రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది’అని భట్టి అన్నారు.

భాజపా తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..

‘భాజపా అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులను ఉసిగొల్పి ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భాజపా వైఖరిని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టాం. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు’అని ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నేతల అరెస్టు.. 

రాజ్భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని