శశిథరూర్‌, అధిర్‌కు కరోనా పాజిటివ్‌  - congress mp shashi tharoor tests positive for covid-19
close
Published : 22/04/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శశిథరూర్‌, అధిర్‌కు కరోనా పాజిటివ్‌ 

దిల్లీ: కరోనా బారిన పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌కు కొవిడ్‌ సోకగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు వైరస్‌ బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకినట్టు కేంద్ర మాజీ మంత్రి, కేరళకు చెందిన ఎంపీ శశిథరూర్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే తన సోదరి, తన మాతృమూర్తి (85)కి వైరస్‌ సోకినట్టు తెలిపారు. తన సోదరి కాలిఫోర్నియాలో ఫైజెర్‌ టీకా తీసుకున్నారని, ఈ నెల 8న తన తల్లితో కలిసి తానూ కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకున్నట్టు వివరించారు.

మరోవైపు తానూ వైరస్‌ బారిన పడినట్టు బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధురి ట్విటర్‌లో వెల్లడించారు. గత ఏడు రోజులుగా తనను కలిసినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ బిజీగా ఉన్న అధిర్‌.. తన ప్రచార కార్యక్రమాలు వర్చువల్‌గా కొనసాగిస్తానని స్పష్టంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని