ఎయిర్‌పోర్టులో మాస్క్‌ లేకుండా కన్పిస్తే.. - consider imposing fines on passengers not wearing masks properly
close
Published : 30/03/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌పోర్టులో మాస్క్‌ లేకుండా కన్పిస్తే..

విమానాశ్రయాలకు డీజీసీఏ ప్రత్యేక సూచనలు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ.. తాజాగా ఎయిర్‌పోర్టులకు సూచనలు చేసింది. విమానాశ్రయాల్లో మాస్క్‌లు లేకుండా కన్పించేవారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 

‘‘కొన్ని విమానాశ్రయాల్లో కొవిడ్‌ నిబంధనల అమలు సంతృప్తికరంగా లేదని ఇటీవల జరిపిన పరిశీలనలో తేలింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలి. ముక్కు, నోటిని కవర్‌ చేసేలా మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించేలా చూడాలి. ఈ అంశాలపై అన్ని ఎయిర్‌పోర్టులు మరింత నిఘా పెంచాలని కోరుతున్నాం. నిబంధనల ఉల్లంఘనలను నిరోధించేందుకు అవసరమైతే శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించండి. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం తక్షణ జరిమానాలు విధించండి’’ అని డీజీసీఏ విమానాశ్రయ నిర్వాహకులను సూచించింది. 

విమానాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదేపదే హెచ్చరించినా మాస్క్‌లు పెట్టుకోకపోతే విమానం నుంచి దించేయాలని ఈ నెల 13న డీజీసీఏ ఎయిర్‌లైన్లను ఆదేశించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మార్చి 15 నుంచి 23 మధ్య 15 ప్రయాణికులను విమానాల నుంచి దించేసినట్లు డీజీసీఏ అధికారులు గతవారం వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని