ప్రాణదాత.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ - continuous production of medical oxygen as surge covid cases saving lives by vizag steel plant
close
Published : 18/04/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణదాత.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌

ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ కీలకంగా మారిన కర్మాగారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఉద్ధృతి బెంబేలెత్తిస్తున్న వేళ ఇప్పుడు చర్చంతా మెడికల్ ఆక్సిజన్‌ గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం అంతకంతకూ పెరుగుతోంది. బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోంది. ప్రభుత్వ సంకల్పం నెరవేర్చడంలో స్టీల్‌ప్లాంట్లు ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్‌ ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తూ రాష్ట్ర, దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. కరోనా కట్టలుతెంచుకుంటున్న వేళ ప్రాణవాయువు కొరత లేకుండా ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారాలన్నింటికీ ఆదేశాలిచ్చింది. సెయిల్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, జేఎస్పీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు కర్మాగారాలు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి. 

కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో విశాఖ ఉక్కు కర్మాగారానిది ప్రముఖ స్థానం. గతేడాది కరోనా విజృంభించిన వేళలోనూ నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా చేసిన ఘనత విశాఖ స్టీల్‌ప్లాంట్‌ది. కింగ్‌జార్జ్‌ ఆసుపత్రితో పాటు సమీప యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉద్ధృతం కాగా ఆక్సిజన్‌ ఉత్పత్తి మరింత పెంచాలని కేంద్రం అన్ని స్టీల్‌ప్లాంట్లను ఆదేశించింది. ఈసారి కూడా ఆక్సిజన్‌ సరఫరాకు సన్నద్ధంగా ఉన్నామని కర్మాగారం సిబ్బంది పేర్కొంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని