కరోనా కట్టడికి గ్రామస్థుల వినూత్న ఆలోచన!  - control spread of corona virus vemulawadas arepalli villagers reversed sitting benches
close
Published : 18/04/2021 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కట్టడికి గ్రామస్థుల వినూత్న ఆలోచన! 

వేములవాడ: రెండో దశ కరోనా విజృంభిస్తున్న వేళ..  వైరస్‌ కట్టడికి పల్లెవాసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్ అమలవుతోంది. మరికొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లిలో మహమ్మారి బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు శ్రమిస్తున్నారు.

గ్రామంలో ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ కూడలిలోని సిమెంట్‌ బెంచీల్లో జనం కూర్చోకుండా వాటిని తలకిందులు చేశారు. గ్రామస్థులు లేదా వేరే ఊరివాళ్లు  ఒకచోట చేరకుండా అలా చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని