మరోసారి కథా వివాదాలు @ టాలీవుడ్‌ - controversies in tollywood movies
close
Published : 31/08/2020 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి కథా వివాదాలు @ టాలీవుడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్ర పరిశ్రమకు వివాదాలు కొత్తేమీ కాదు. సినిమా మొదలైన దగ్గరి నుంచి విడుదలైన తర్వాత కూడా ఏదో ఒక విషయంలో ఈ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. అదిగో ఆ కథ, కాన్సెప్ట్‌ నాదేనంటూ ఎంతోమంది ఫిలిం ఛాంబర్లు చుట్టూ తిరుగుతుంటారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌లు పెట్టడం, టెలివిజన్‌ వేదికగా డిబేట్‌లో ఇలా ఒక్కటేమిటి పెద్ద సినిమా అయితే, ఓ నాలుగైదు రోజుల పాటు ఈ వివాదం టాపిక్‌ హాట్‌ హాట్‌గా నడుస్తుంటుంది. తాజాగా కొన్ని సినిమాల విషయంలో కథ తమదేనంటూ వివాదం నడుస్తోంది. అవేంటో చూద్దామా!

‘ఆచార్య’తో ఇప్పుడు మరోసారి!

తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వెంటనే ‘ఆచార్య’ స్టోరీ కాపీనంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆచార్య’ స్టోరీ, కాన్సెప్ట్‌ కొరటాల శివ సొంతంగా రాసుకున్నదని స్పష్టం చేసింది. ఈ  చిత్ర కథ కొద్ది మందికి మాత్రమే తెలుసునని, మోషన్‌ పోస్టర్‌ చూసి నిరాధార ఆరోపణలు తగదని పేర్కొంది.

మైత్రీ మూ మేకర్స్‌ అలా..!

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా మరో వివాదంపై స్పందించింది. రాజేశ్‌ మండూరి అనే రచయిత చేస్తున్న ఆరోపణలను ఖండించింది. ఆయన చెప్పిన కథతో కొరటాల శివ దర్శకుడిగా సినిమా తీస్తున్నామని ఆరోపణలు చేయడం సరికాదని తెలిపింది. రాజేశ్‌ చెప్పి కథ బాగోలేదని, అందుకే సినిమా చేయలేమని చెప్పామని పేర్కొంది.  అదే సమయంలో తాము ముగ్గురు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసింది.

‘పుష్ప’ కథ కూడా..

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా నుంచి కేవలం బన్ని లుక్‌ మాత్రమే విడుదలైంది. అయితే, ఇందులో ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇప్పటికే కొంత భాగాన్ని శేషాచలం అడవుల్లో చిత్రీకరించారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథ తనదేనంటూ ఓ రచయిత ముందుకు వచ్చారు. తాను రాసిన ‘తమిళకూలీ’ అనే కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ఆయన ఆరోపించారు.  దీంతో ఒక్కసారిగా ‘పుష్ప’ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ఎవరూ స్పందించలేదు.

టాలీవుడ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు!
తెలుగు చిత్ర పరిశ్రమకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ‘సైరా’ కథను తీసుకుని, తమకు ఇస్తానన్న మొత్తం ఇవ్వలేదని ఉయ్యాలవాడ వంశస్థులు చిరు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. హరీశ్‌ శంకర్‌-వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గద్దల కొండ గణేష్‌’ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ పెట్టగా వివాదం చెలరేగింది. విడుదలకు ముందు రోజు టైటిల్‌ను మార్చారు. ఇక విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’, మహేశ్‌బాబు ‘మహర్షి’, పవన్‌, ‘అజ్ఞాతవాసి’, ‘జార్జిరెడ్డి’ సినిమాలపై ఏదో ఒక విషయంలో వివాదాలు నెలకొన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని