కొవిడ్‌ ఎఫెక్ట్‌.. షూట్‌ నిలిపివేత - cops halt ek villian returns shoot since no covid protocols were followed
close
Published : 06/03/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఎఫెక్ట్‌.. షూట్‌ నిలిపివేత

 

ముంబయి: బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం సినిమా షూట్‌ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ముంబయి పోలీసులు ఆయన షూటింగ్‌ను అడ్డుకున్నారు. జాన్‌ అబ్రహాం కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌‌’. దిశాపటానీ కథానాయిక. మోహిత్‌ సూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వర్లీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, కొవిడ్‌-19 నిబంధనలు పాటించకుండా షూట్‌ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. లొకేషన్‌ వద్దకు చేరుకుని షూట్‌ని నిలిపివేశారు. అంతేకాకుండా, నటీనటుల్ని అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని