దేశంలో కరోనా టెస్టులు @ 20 కోట్లు! - coron virus test around country wide rea
close
Updated : 06/02/2021 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో కరోనా టెస్టులు @ 20 కోట్లు!

దిల్లీ: కరోనా వైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కొవిడ్‌-19 పరీక్షల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం వెల్లడించింది. 

‘దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 20కోట్ల మైలు రాయిని దాటింది. వాటిలో 7.40లక్షల టెస్టులు గడిచిన 24 గంటల్లో చేసినవే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 2,369 టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉండగా.. వాటిలో 1,214 ప్రభుత్వానివి కాగా.. మరో 1,155 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రయోగశాలల సామర్థ్యం మెరుగ్గా ఉన్నందువల్లే పరీక్షల సంఖ్య కూడా భారీగా పుంజుకుంది. అదేవిధంగా పరీక్షల సంఖ్య పెరగడం వల్లే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనా క్యుములేటివ్‌ పాజిటివిటీ రేటు 5.39శాతానికి చేరింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.48లక్షలకు చేరింది. గత ఎనిమిది నెలల్లో దేశంలోని యాక్టివ్‌ కేసులు ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 95 మంది కరోనా కారణంగా మరణించారని’ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకుంటోంది. టీకా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి శనివారం ఉదయం 8గంటల సమయానికి దేశవ్యాప్తంగా టీకా వేయించుకున్న వారి సంఖ్య 54 లక్షలకు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అత్యంత వేగంగా ఐదు మిలియన్ల మంది టీకా తీసుకున్న దేశంగానూ భారత్‌ రికార్డు సృష్టించింది. కేవలం 21 రోజుల్లోనే ఈ రికార్డు సాధించడం విశేషం. 

ఇదీ చదవండి

భారత్‌లో 50లక్షల మందికి టీకా పూర్తి!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని