తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం - corona agitation in tirumala vedic school
close
Updated : 10/03/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

తిరుమల: తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులను తిరుపతి పద్మావతి కొవిడ్‌ కేంద్రానికి తరలించారు. గతంలోనూ ఈ వేదపాఠశాలలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పాటు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేద పాఠశాలలో ఒకే సారి 50 కేసులు నమోదవడం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. వేద పాఠశాల విద్యార్థులు రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని