తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Published : 01/02/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 17,686 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 118 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,587కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,601కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 264 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,894కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,092 ఉండగా వీరిలో 723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనాపరీక్షల సంఖ్య 78,79,047కి చేరింది.

ఇవీ చదవండి..

నెలరోజుల్లో 24 వేల పదోన్నతులు

వచ్చేదెంత?



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని