తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Published : 03/02/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,924కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,604కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 197 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,91,312కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 730 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని