తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Published : 09/02/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 31,834 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,95,831కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,612కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 186 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,92,415కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,804 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 694 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 81,54,347కి చేరింది.

ఇదీ చదవండి..
రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా పంపిణీ షురూ



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని