తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Updated : 16/02/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 24,851 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా   కొత్తగా 129 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,802కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,619కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 161 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,540కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,643 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 637 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 83,36,255కి చేరింది.

ఇదీ చదవండి...

ట్రంప్‌పై 9/11 తరహా కమిషన్‌!

ఈజిప్టులో బయటపడ్డ  ప్రాచీన బీర్‌ ఫ్యాక్టరీ 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని