తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Updated : 18/02/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 24,920 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,622కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 101 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,791కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,700 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 658 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 83,85,870కి చేరింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని