తెలంగాణలో 3వేలు దాటిన కరోనా కేసులు - corona cases up date in telangana
close
Updated : 11/04/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 3వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,15,311 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,759కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 787 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,335కి చేరింది. ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 13,366 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 551 కేసులు నమోదయ్యాయి. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని