సినీ కార్మికులకు ఉచితంగా టీకా: చిరంజీవి - corona crisis charity will provide free vaccination for cinema workers
close
Published : 20/04/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీ కార్మికులకు ఉచితంగా టీకా: చిరంజీవి

హైదరాబాద్‌: కరోనా సమయంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమలోని వారందరి నుంచి విరాళాలు సేకరించి కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా లాక్‌డౌన్‌లో సమయంలో కార్మికులకు నిత్యావసరాలు అందించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి పర్యవేక్షణలో సాగిన సీసీసీ ఇప్పుడు మరో బృహత్‌ కార్యానికి నడుం బిగించింది. సినీ పరిశ్రమలో 45ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు.

‘‘అందరికీ నమస్కారం.. తెలుగు చిత్ర పరిశ్రమలో 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో మన కరోనా క్రైసిస్‌ ఛారిటీ ఒక కార్యక్రమం తలపెట్టింది. ఈ గురువారం నుంచి నెల రోజుల పాటు, ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జరుగుతుంది. 45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు మీ అసోసియేషన్‌, యూనియన్‌లో పేరు నమోదు చేసుకోండి. మీతో పాటు, మీ జీవిత భాగస్వామి కూడా 45ఏళ్లు దాటితే వారికి కూడా వ్యాక్సినేషన్‌ పూర్తి ఉచితం. షెడ్యూల్‌ ప్రకారం కొంతమందికి అపోలో ఆస్పత్రిలో తగిన వసతులతో వ్యాక్సిన్‌ ఇస్తారు. అలాగే అపోలో 24/7 ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించవచ్చు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి రాయితీపై మందులు లభించే వెసులుబాటు లభిస్తుంది. కరోనా నుంచి మన పరిశ్రమను మనం కాపాడుకుందాం. దయ చేసి ముందుకు రండి.. వ్యాక్సిన్‌ వేయించుకోండి.’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని