ఏపీలో కరోనా: ఒక్కరోజులో 10వేల కేసులు - corona details in andhrapradesh
close
Updated : 29/07/2020 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కరోనా: ఒక్కరోజులో 10వేల కేసులు

బులిటెన్‌ విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (9am-9am) 70,584  నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఇవాళ కొవిడ్‌-19 నుంచి 2,784 మంది కోలుకోగా.. మొత్తం 55,406 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 63,771 మంది చికిత్స పొందుతున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో మరో  తూర్పుగోదావరిలో 14, అనంతపురం 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు, నెల్లూరులో ఐదురుగురేసి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో నలుగురేసి, గుంటూరు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరేసి ఇవాళ మృతి చెందారు. కరోనాతో  ఇప్పటి వరకు 1,213 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటి వరకు రాష్ట్రంలో 18,20,009 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని