ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు - corona effect ambulance queues infront of covid hospitals in gujarat
close
Published : 19/04/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు

రాజ్‌కోట్‌: గుజరాత్‌లో కరోనా విలయతాండవం కొనసాగిస్తున్న వేళ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక రోగులు ఆంబులెన్సుల్లోనే వేచిచూస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని సివిల్‌ ఆసుపత్రి ముందు పదుల సంఖ్యలో బారులు తీరాయి. ఈ దృశ్యం కరోనా తీవ్రతకు, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. గుజరాత్‌లో ఒక్కరోజులోనే 9,541 కేసులు నమోదయ్యాయి. 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 5,267 మంది మరణించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని