ఒకే బడిలో 12మంది విద్యార్థినులకు కరోనా - corona for twel students
close
Updated : 10/04/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే బడిలో 12మంది విద్యార్థినులకు కరోనా

చాగలమర్రి: ఆంధ్రప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 2,765 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పలు పాఠశాలల్లో విద్యార్థులు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా చాగలమర్రి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో కొందరు విద్యార్థినులకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  పాఠశాలలో మొత్తం 246 మంది విద్యార్థినులు  ఉన్నారు. మూడు రోజుల క్రితం 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 12 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యులు గంగాధర్‌, ఎస్‌ఓ హబిబున్నిసా తెలిపారు. కొవిడ్‌ సోకిన వారిని పాఠశాలలోని ఓ గదిలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. మిగతా వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు  వివరించారు. 

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టిపయింది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. రాష్ట్రంలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 31,892 నమూనాలను పరీక్షించగా గుర్తించిన కేసులు 2,765 (8.6%) ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు 490, కృష్ణా 341, విశాఖపట్నం జిల్లాలో 335 చొప్పున కేసులు నమోదయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని