ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు.. - corona patient fell down from bed nobody cares in visakha vims
close
Published : 03/08/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు..

విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖపట్నంలోని విమ్స్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఓ మహిళ మంచంపైనుంచి కింద పడినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదని కరోనా వార్డుల్లోని ఇతర రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య పరికరాలు ఉన్నా వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే నాథుడే లేరంటూ ఆందోళన చెందుతున్నారు. బెడ్‌లో రోగి మృతిచెందినా కనీసం శానిటైజేషన్‌ చేయకుండానే అదే బెడ్‌లో మరో రోగిని చేర్చుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. క్షేమంగా ఇంటికి చేరతామో లేదో అంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరుగుదొడ్లలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతున్నారు.

స్పందించిన అధికారులు

విశాఖ విమ్స్‌లో కరోనా సోకిన మహిళను పట్టించుకోలేదన్న ఘటనపై అధికారులు స్పందించారు. స్నానాల గదికి వెళ్తుండగా పడిపోయారని పేర్కొన్నారు. వెంటనే స్పందించి తిరిగి బెడ్‌పైకి చేర్చామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనల విషయంలో కాస్త సంయమనం పాటించాలన్న అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలకు తెగించి సిబ్బంది వైద్య సేవలను అందిస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అన్ని రకాల సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని