దేశంలో60 లక్షలు దాటిన కరోనా కేసులు - corona positive cases crossed 60 lakh mark
close
Published : 28/09/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో60 లక్షలు దాటిన కరోనా కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా భారత్‌  నిత్యం 80వేలకు పైచిలుకు కేసులతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆదివారం రాత్రి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది.  60,66,061 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 95,466 మంది మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 10 లక్షల 64 వేలకు పైగా కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 12 రోజుల క్రితం వరకు 50 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేవలం 12 రోజుల్లోనే 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 82.46శాతం ఉండగా, మరణాల రేటు 1.58శాతంగా ఉంది. రికవరీ శాతంలో ప్రపంచంలోనే భారత్‌ మొదటి స్థానంలో ఉంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని