Corona: కంగనకు పాజిటివ్‌ - corona positive for kangana ranuat
close
Published : 08/05/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కంగనకు పాజిటివ్‌

ముంబయి: తాను కరోనా బారిన పడినట్లు బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి నీరసం, కళ్ల మంటలు ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకోగా తనకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఉదయం ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ధ్యానం చేస్తోన్న ఓ ఫొటోని షేర్‌ చేశారు.

‘గత కొన్నిరోజుల నుంచి నీరసం, కళ్ల మంటలు ఉండటంతో హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకున్నాను. నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈరోజు ఉదయం ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యాను. ఇప్పుడు నాకు తెలిసిందిల్లా ఒక్కటే.. వైరస్‌ని ధైర్యంగా, బలంగా ఎదుర్కోవాలి. దయచేసి మనోధైర్యం అనే మీ బలాన్ని వేరొకరి చేతిలో పెట్టకండి. మీరు భయపడితే అది ఇంకా మిమ్మల్ని భయపెడుతుంది. కొవిడ్‌-19 అంటే కేవలం ఒకరకమైన జలుబుగా భావించండి. అందరం కలిసి దానిపై ధైర్యంగా పోరాటం చేద్దాం’ అని కంగన పిలుపునిచ్చారు



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని