తెలంగాణలో కరోనా: 1,198 కేసులు - corona update in telangana
close
Updated : 20/07/2020 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కరోనా: 1,198 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్‌ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కు.. మృతుల సంఖ్య 422కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 11,530 ఉండగా.. 34,323 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 510 కేసులు.. రంగారెడ్డిలో 106 కేసులు, మేడ్చల్‌లో 76 కేసులు వచ్చాయి. ఇవాళ ఒక్క రోజే 11,003 కరోనా పరీక్షలు చేయగా.. నిన్నటి వరకు 2,65,219 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 74శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.91శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 14,959 కరోనా బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని