ఏపీలో కొత్తగా 4,074 కరోనా కేసులు - corona updates of ap
close
Published : 20/07/2020 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొత్తగా 4,074 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,074 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కి చేరింది. యాక్టివ్‌ కేసులు 28,800 ఉండగా.. 24,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 696 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 33,580 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,086 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 596, కర్నూల్‌లో 559 కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున కరోనా వల్ల మరణించారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపూర్‌ జిల్లాలో ఆరుగురు చొప్పున.. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. కర్నూల్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని