తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే.. - corona vaccination in telangana
close
Updated : 01/03/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలు కానుంది. 60 ఏళ్లకు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతున్నవారికి టీకాలు వేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రెండు కేటగిరిలకు చెందిన వారు దాదాపు 50 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టీకా ఉచితం కాగా, ప్రైవేట్‌ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మేరకు టీకా వేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి సోమవారం టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు. తొలిరోజు 102 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నారు. 45 ప్రభుత్వ, 57 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టీకా వేయనున్నారు. హైదరాబాద్‌ నగరంలో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నారో అధికారులు తాజాగా జాబితా విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, కింగ్‌ కోఠి, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, అపోలో(జూబ్లీహిల్స్‌), యశోదా(సికింద్రాబాద్‌, సోమాజిగూడ),స్టార్‌, కిమ్స్‌, పారమిత, కేర్‌ (బంజారాహిల్స్‌) తదితర ప్రముఖ ఆసుప్రతుల్లో కోవిడ్‌ టీకా వేసేందుకు అనుమతి లభించింది. సోమవారం మరికొన్ని ఆసుపత్రులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి అనుమతి వచ్చే అవకాశం ఉంది.  

తెలంగాణలోని ఆసుపత్రుల జాబితా కోసం క్లిక్‌ చేయండి

 

 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని