మహారాష్ట్రలో ఒక్కరోజే 10వేల కేసులు - corona virus cases update in maharastra delhi
close
Published : 05/03/2021 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో ఒక్కరోజే 10వేల కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గత కొంతకాలంగా తగ్గినట్టే కనబడిన రోజువారీ కేసులు.. ఫిబ్రవరి రెండో వారం నుంచి క్రమంగా పెరగడం కలవరపెడుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10,216 కొత్త కేసులు రావడం గమనార్హం. 53 మంది మరణించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండట ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్క ముంబయి మహా నగరంలోనే 1,173 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,467 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,66,86,880 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 21,98,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరిలో 20,55,951 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 52,393 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో రికవరీ రేటు 93.52శాతంగా ఉంది. ప్రస్తుతం 88,838 క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, కొత్తగా వస్తున్న కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటకల్లోనే 85 శాతంగా ఉంటున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంటోంది.

దిల్లీలో జనవరి 14 తర్వాత తొలిసారి..

దేశ రాజధాని నగరం దిల్లీలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 59,112 శాంపిల్స్‌ పరీక్షించగా..  312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మూడు మరణాలు నమోదయ్యాయి. జనవరి 14 తర్వాత గరిష్ఠ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా 1,26,81,441 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,40,494 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 6,27,797మంది కోలుకోగా.. 10,918మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం అక్కడ 1,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని