వైరస్‌ వ్యాప్తికి ‘ఆధార్‌’మవుతున్నాయ్‌ - corona virus spread
close
Published : 17/04/2021 08:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ వ్యాప్తికి ‘ఆధార్‌’మవుతున్నాయ్‌

వేలిముద్రలు, ఐరిస్‌ యంత్రాలతో సోకుతున్న కరోనా  

హైదరాబాద్‌ : ఆధార్‌ సేవా కేంద్రాలు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్‌ను పరిశీలించే స్కానర్లు ఇందుకు దోహదపడుతున్నాయి. మీసేవా, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొవిడ్‌కు గురవుతుండటమే ఇందుకు నిదర్శనం. వినియోగదారులు సైతం ప్రభావితమవుతున్నారు. రక్షణ చర్యల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది. వేలి ముద్రల సమస్యతో ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వృద్ధులు, కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునే చిన్నారులు మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

గ్రేటర్‌ పరిధిలో ఆధార్‌ సేవలందించే కేంద్రాలు 200కు పైగా ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 50-100 మంది సేవలు పొందుతారు. మెజార్టీ వృద్ధులు, చిన్న పిల్లలే ఉంటారు. రేషన్‌ తీసుకొనేప్పుడు వేలి ముద్రలు సరిగా పడకపోవడం, ఫోన్‌ నంబరును జత చేయడం, ఇతరత్రా అవసరాలతో ఎక్కువగా ఆధార్‌ కార్డు సవరణకు అభ్యర్థనలు వస్తుంటాయి. కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేందుకు తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొస్తుంటారు. ఇలాంటి ఏ సేవకైనా.. ఆధార్‌ కేంద్రం అధికారి వేలిముద్రలు, ఐరిస్‌ పరిశీలన తప్పనిసరి. స్కానర్లపై ఆపరేటర్‌ వేలిముద్ర, ఐరిస్‌ ధ్రువీకరణ పూర్తయ్యాకే సంబంధిత వెబ్‌సైట్‌ తెరుచుకుంటుంది. వినియోగదారులదీ అదే పరిస్థితి. సవరణను అంగీకరిస్తూ ఆపరేటర్‌ ఉపయోగించిన స్కానర్లతో వేలిముద్రలను, ఐరిస్‌ను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. చేతులు, కంటి స్కానర్ల ద్వారా కొవిడ్‌ వైరస్‌ వ్యాపిస్తోంది.

ఇవీ నిదర్శనాలు

కర్మన్‌ఘాట్‌ మీసేవా కేంద్రం సిబ్బందితోపాటు, అక్కడ ఆధార్‌ సేవలు పొందిన ఓ మహిళకు కొవిడ్‌ సోకడంతో ఈ కేంద్రాలపై చర్చ మొదలైంది. ఖైరతాబాద్‌ మీసేవా కేంద్రాల్లోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని సగానికిపైగా మీసేవా కేంద్రాలు, ప్రైవేటు కేంద్రాలు, ఆధార్‌ సేవలందించే బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా బాధితులు వారంలోనే విధుల్లోకి వస్తున్నా మేనేజర్లు పట్టించుకోవట్లేదు. సిబ్బంది కొరతతో జ్వరం, జలుబు, ఇతర వ్యాధి లక్షణాలున్న వారితోనూ పనులు చేయిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి లోనికి అనుమతించే వ్యవస్థ లేదు. కరోనా నిబంధనలు సరిగా అమలు కావట్లేదు. తీవ్రతను గుర్తించి ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని