కరోనా వైరస్‌ రకాలను ముందే పసిగట్టొచ్చు! - corona virus types can be detected in advance
close
Updated : 27/02/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వైరస్‌ రకాలను ముందే పసిగట్టొచ్చు!

దిల్లీ: ప్రస్తుతం ఏ రకమైన కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది? భవిష్యత్తులో వైరస్‌లు ఎలా మార్పు చెందనున్నాయి? అన్న విషయాలను ముందుగా అంచనావేసే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యాంటీబాడీలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగే వైరస్‌లను గుర్తించేందుకు; తద్వారా మరింత సమర్థమైన వ్యాక్సిన్ల తయారీకి తమ పరిశోధన దోహదపడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దిల్లీలోని ‘సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ’ ఈ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా- కరోనా స్పైక్‌ ప్రొటీన్‌కు సంబంధించి 3,11,795 రకాల జన్యు క్రమాలను, ప్రొటీన్‌లోని అమైనో ఆమ్లాల్లో జరిగే ఉత్పరివర్తనాలను వారు మదింపు వేశారు. పలు రకాల కరోనా వైరస్‌ ప్రొటీన్లలోని అమైనో ఆమ్లాణువుల శ్రేణులను విశ్లేషించారు.

స్పైక్‌ ప్రొటీన్‌లో చోటుచేసుకునే 2,584 ఉత్పరివర్తనాలు మనిషి దేహంలోకి వైరస్‌ చొచ్చుకువెళ్లేందుకు దోహదపడుతున్నట్టు గుర్తించారు. ‘‘ప్రస్తుతమున్న కొవిడ్‌ వ్యాక్సిన్లు... కరోనా వైరస్‌లోని నిర్ణీత ప్రొటీన్లకు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలను అభివృద్ధి చేసేందుకు రూపొందించినవే. అయితే కొన్ని ప్రొటీన్లు ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ, యాంటీబాడీలకు చిక్కడం లేదు!  మ్యూటేషన్‌ క్లస్టర్లను ఉపయోగించి ఈ ప్రొటీన్లు ఎలా మార్పు చెందుతున్నాయన్నది ముందుగానే అంచనా వేశాం. ఇందుకు సరికొత్త విధానాన్ని రూపొందించాం. స్పైక్‌ ప్రొటీన్‌లోని అమైనో ఆమ్లాలకు సంబంధించి కీలకమైన ఎన్‌501, ఏ222, ఎన్‌439, ఎస్‌477 క్లస్టర్లపై దృష్టి సారించాం’’ అని పరిశోధనకర్త లిపి ఠుక్రాల్‌ వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని