దేశంలో కరోనా మరణాలు @138 - corona virus update india
close
Updated : 25/02/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో కరోనా మరణాలు @138

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం మరోసారి తారా స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది మహమ్మారి కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కేసుల విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే భారీ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 7.93లక్షల పరీక్షలు చేయగా.. 16,738 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది. కొత్తగా 11,799మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,07,38,501కు చేరి.. రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో 138 మంది ప్రాణాలు కోల్పోడంతో.. మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,705కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  1,51,708కు చేరాయి. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5.03లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా తీసుకొన్న వారి సంఖ్య 1,26,71,163కి చేరింది. 
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని