తీవ్రస్థాయిలో ఎన్‌440కే వైరస్‌ ఉత్పరివర్తనం - coronavirus mutated strain in india n440k spread rapidly in south states ccmb scientists
close
Published : 23/02/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీవ్రస్థాయిలో ఎన్‌440కే వైరస్‌ ఉత్పరివర్తనం

ఏడు వేలకుపైగా వైరస్‌ ఉత్పరివర్తనాలు

దిల్లీ: దేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందులో పలు మ్యుటేషన్లు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఐదు వేలకు పైగా కొత్త కరోనా రకాలపై సమగ్ర పరిశీలన చేసి కరోనా ఎలా మార్పులు చెందిందో సీసీఎంబీ పరిశీలించింది. అనంతరం దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది.

ఎన్‌440కే అనే కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం దేశంలో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎన్‌440కే రకం దక్షిణాది రాష్ట్రాల్లోనే విజృంభిస్తున్నట్లు సీసీఎంబీ కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రతి వైరస్‌ ఉత్పరివర్తనం కొత్త రకం కరోనా వైరస్‌ కానక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌-19 జన్యు సమాచారం జెనెటిక్‌ కోడ్‌ను కనుగొనడంలో భారత్‌ వెనకబడి ఉందని మిశ్రా అన్నారు. ఇప్పటివరకు కోటి కరోనా కేసుల్లో కేవలం 6400 జీనోమ్‌లను కనుగొన్నారని పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని