ap news: బొబ్బిలి కోటలో బంగారం భద్రం - counting of gold in bobbili fort
close
Published : 03/08/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap news: బొబ్బిలి కోటలో బంగారం భద్రం

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాలస్వామి, శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆలయ ఆభరణాల లెక్కింపు బొబ్బిలి కోటలో రెండో రోజు కూడా జరిగింది. కోట బాండాగారంలో ఉన్న వెండి, ఇత్తడి వస్తువులను లెక్కించారు. రెండు ఆలయాలకు సంబంధించి సుమారు 18 కిలోల వెండి, ఇత్తడి ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు.  కోటలో బంగారు ఆభరణాలు పరిశీలించగా.. 300 గ్రాములు రికార్డుల కంటే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయ్‌ కృష్ణ రంగారావు, కమిటీ ప్రత్యేక అధికారి భ్రమరాంబ సమక్షంలో గణన సాగింది. సీతారామస్వామికి సంబంధించిన వెండి వస్తువులు ఆలయ బాండాగారంలో ఉండటంతో బుధవారం వాటిని లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ... ఆభరణాల లెక్కింపునకు  ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేయడం ఆనందంగా ఉందన్నారు. రికార్డులో ఉన్న వాటికంటే అదనంగా కొన్ని ఆభరణాలు ఉన్నాయన్నారు. ఈ ఆభరణాలు బ్యాంకు లాకర్‌లో ఉంచడం సరికాదని, స్వామికి అలంకరణ చేయడానికి తాము ఇచ్చామన్నారు. కోట బాండాగారంలో ఉన్న ఆభరణాల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.  నాలుగు వేల ఎకరాల భూమిని తమ పూర్వీకులు ఆలయానికి ఇచ్చారని, ప్రతి ఎకరం స్వాధీనం చేసుకోవాలన్నారు. భూమి ఎక్కడున్నా దర్యాప్తు నిర్వహించి ఆలయానికి చెందేలా చూడాలన్నారు. కమిటీ ప్రత్యేక అధికారి భ్రమరాంబ మాట్లాడుతూ.. రికార్డుల్లో ఉన్న ఆభరణాలు పక్కగా ఉన్నాయన్నారు. వేణుగోపాల స్వామికి సంబంధించి 300 గ్రాముల బంగారం అధికంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. సీతారామ స్వామి ఆలయంలో ఉన్న ఆభరణాలు లెక్కించాలని, అప్పుడే వాస్తవ లెక్కలు తేలుతాయని అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని