దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం - country facing emergency like situation says sc
close
Updated : 22/04/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం

కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణ 

కేంద్రానికి నోటీసులు జారీ 

దిల్లీ: ‘‘దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది’’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నానాటికీ ఉద్ధృతమవుతున్న వేళ దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. వైరస్‌ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 

‘‘దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరిస్తున్నాం’’ అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే తెలిపారు. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా నియమించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. 

ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అన్నారు. కొవిడ్‌ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం పేర్కొంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని