నవ దంపతులకు వినూత్న కానుక! - couple in tamil nadu receives gas cylinder and petrol and onions as wedding gift
close
Updated : 19/02/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ దంపతులకు వినూత్న కానుక!

చెన్నై: మీరో పెళ్లికి వెళ్తున్నారు.. కానుకగా ఏం పట్టుకెళతారు?ఏ బహుమతో, పుష్పగుచ్చమో కదా! ప్రస్తుతం ఆ ట్రెండ్‌ మారింది. ఇప్పుడు మనం వాడే నిత్యావసర సరకుల్లో ఏది ఎక్కువ ధర ఉంటే వాటిని వధూవరులకు పెళ్లి కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, గ్యాస్‌ బండ, ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న వీటి ధరల తీరును తెలియజెప్పేలా తమిళనాడుకు చెందిన కొందరు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. తమ మిత్రుడి పెళ్లికి వాటినే కానుకగా ఇచ్చారు.

చెన్నైకి చెందిన కార్తిక్‌, శరణ్య వివాహ వేడుకను వంగరంలోని ఓ కల్యాణ వేదికలో ఘనంగా నిర్వహించారు. వేడుకకు వెళ్లిన కొందరు యువకులు ఐదు లీటర్ల పెట్రోల్‌, గ్యాస్‌ బండను దంపతులకు బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా ఉల్లిపాయలతో చేసిన దండలను వధూవరుల మెడలో వేశారు. నవ దంపతులతోపాటు వివాహ వేడుకకు వచ్చిన వారంతా ఈ బహుమతులు చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని