బ్లాక్‌ ఫంగస్‌ మందు పంపిణీ విధానాన్ని రూపొందించండి - court asks centre delhi to form policy on distribution of black fungus drug
close
Published : 01/06/2021 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్‌ ఫంగస్‌ మందు పంపిణీ విధానాన్ని రూపొందించండి

కేంద్రం, కేజ్రీవాల్‌ సర్కారుకు దిల్లీ హైకోర్టు సూచన

దిల్లీ: దేశంలో రోజురోజుకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు వినియోగించే యాంఫోటెరిసిన్‌-బి ఔషధం పంపిణీకి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రం, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాలకు దిల్లీ హైకోర్టు సూచించింది. ఈ ఔషధం కొరత ఉన్నంత వరకు పంపిణీకి నిర్దిష్ట వయసు వారిని మినహాయిస్తూ కఠిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మందును ఇచ్చే నిర్ణయాధికారాన్ని వైద్యులకు వదిలేయొద్దని తెలిపింది. 80 ఏళ్లు, 35 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతుండగా కేవలం ఒక డోసే అందుబాటులో ఉంటే.. ఆ మందును ఎవరికి ఇవ్వాలో తెలపాలంటూ ఓ ఉదాహరణను వివరించింది. అయితే ఏ వ్యక్తి ప్రాణమైనా మరో వ్యక్తి కంటే తక్కువని చెప్పడం తమ  ఉద్దేశం కాదని న్యాయమూర్తులు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితమూ ప్రధానమేనని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని