రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష - court orders imprisonment for radhika sarathkumar
close
Published : 07/04/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష

చెన్నై: చెక్‌ బౌన్స్‌ కేసులో ప్రముఖ సెలబ్రిటీ జంట రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష పడింది. ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ చెన్నై స్పెషల్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. శరత్‌కుమార్‌, రాధిక, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా గతంలో సినిమాలు నిర్మించేవాళ్లు. ఈ క్రమంలోనే రేడియన్స్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్‌ సంస్థకు చెక్‌ అందజేయగా.. అది బౌన్స్‌ అయ్యింది. దీంతో రేడియన్స్‌ సంస్థ  కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పునిచ్చింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని