కొవిడ్‌ అంతా మార్చేస్తోంది - covid‌ is changing everything
close
Published : 04/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ అంతా మార్చేస్తోంది

వచ్చే రెండేళ్లు వాహన అమ్మకాలపై తీవ్ర ప్రభావం
 వినియోగదారుల అభిప్రాయం ఎలా ఉంటుందో
 టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

రంగంలో రాబోయే రెండేళ్లలో గణనీయ మార్పులొస్తున్నాయని అంచనా వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వివరించారు.  ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణానికి ఇష్టపడతారా లేక ప్రజా రవాణాలో కొనసాగుతారా అనేది గమనించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రయాణికుల వాహనాలకు లభించే గిరాకీ ఈ పరిణామంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. టాటా మోటార్స్‌ దేశీయ వ్యాపారం కూడా పునరుత్తేజం అవుతున్న క్రమంలో, 2019-20లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, కొవిడ్‌ మళ్లీ ప్రతికూల ప్రభావం చూపాయని వాటాదార్ల సమావేశంలో చంద్రశేఖరన్‌ తెలిపారు. బ్రెగ్టిట్‌పై స్పష్టత వచ్చిందని అయితే వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదించడం, కఠిన నియంత్రణావళి వంటివి వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేశాయని వివరించారు. డిజిటల్‌ అనుభవాలపై ఆసక్తి పెరుగుతోందని, ఆరోగ్య సంరక్షణ, భద్రతా అంశాలకు ప్రాధాన్యం ఇనుమడిస్తోందన్నారు. ప్రయాణాలు తగ్గించుకోవడం రవాణా రంగంపై అమిత ప్రభావం చూపుతోందని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని