Lockdown: కొత్త ఉపాధికి ‘గురి’ పెట్టాడు - covid -19 lockdown wakes up this kozhikode man making arrows and bows
close
Published : 14/05/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: కొత్త ఉపాధికి ‘గురి’ పెట్టాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఉపాధి కోల్పోయామని కుంగుబాటుకు లోను కాకుండా కొందరు తమలోని నైపుణ్యాలను సానబెట్టి వాటిద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ కోవకి చెందినవారే కేరళకు చెందిన టిన్స్ ఎం.థామస్.

కోలికోడ్‌ జిల్లా తొట్టుముక్కమ్‌కు చెందిన టిన్స్ ఇళ్లల్లో తోటమాలిగా పనిచేసేవాడు. గతేడాది లాక్‌డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన టిన్స్‌ ఇంటికే పరిమితమయ్యాడు. బాహుబలి తరహా సినిమాల్లో విల్లు, బాణాల ఉపయోగించడాన్ని చూసిన టిన్స్ వాటిని తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని మొదలు పెట్టాడు. మొదట్లో ఆశించిన ఫలితం రాకపోయినా, నిరాశ చెందకుండా ప్రయత్నించాడు. విల్లులు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్నవాళ్లను సంప్రదించాడు. యూట్యూబ్ సాయంతో శిక్షణ పొంది రకరకాల విల్లులు, బాణాలు తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. తయారు చేయడంలోనే కాదు, వాటిని ప్రయోగించడంలో కూడా ఆరితేరాడు. తాను తయారుచేసిన బాణాలతో బాహుబలి సినిమాలో మాదిరిగా ఒకే సారి 3, 4 బాణాలను ప్రయోగిస్తున్నాడు. 30 నుంచి 50 మీటర్ల దూరం వరకూ లక్ష్యాలను గురిపెడుతున్నాడు. టిన్స్‌ తయారు చేసే విల్లు, బాణాలకు ప్రాచుర్యం లభించడంతో అతనికి తిరిగి ఉపాధి లభించింది. ఒక విల్లు, దానికి సరిపడా బాణాలను తయారు చేసేందుకు 4 రోజులు పడుతోందని, మార్కెట్‌లో ఒక్కో దాని ధర 2 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పలుకుతోందని టిన్స్‌ చెప్పుకొచ్చారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని