వాక్సిన్‌ తీసుకుంటే మెక్‌డొనాల్డ్స్‌ స్పెషల్‌ ఆఫర్స్‌ - covid-19 mcdonalds offering special deals to those vaccinated
close
Published : 09/06/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాక్సిన్‌ తీసుకుంటే మెక్‌డొనాల్డ్స్‌ స్పెషల్‌ ఆఫర్స్‌

ప్రజల్లోకి టీకా ప్రాముఖ్యత తెలిపేందుకే ఇలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ కష్ట కాలంలో ఎవరికి వారు ఎంతో కొంత ఇతరులకు సాయపడటాన్ని చూస్తూనే ఉన్నాం. ఆతిథ్య రంగంలో ముఖ్యంగా హోటల్స్‌, రెస్టారెంట్లు సైతం కొవిడ్‌ మీల్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌, ఐసోలేషన్‌ సెంటర్లు.. ఇలా మరెన్నో ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు టీకా తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ తాజాగా మెక్‌డొనాల్డ్‌ ‘వియ్‌ కేర్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీకా తీసుకున్న వారికి ‘లిమిటెడ్‌ టైమ్‌’ పేరుతో మీల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. తూర్పు, ఉత్తర భారతదేశంలో ఈ సేవలు అందించనున్నారు. మెక్‌డొనాల్డ్‌ యాప్‌లో టీకా తీసుకున్న వారు ధ్రువీకరణ పత్రంతో పాటు ఇతర వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎస్సెమ్మెస్‌ రూపంలో ఒక కోడ్‌ వస్తుంది. దాన్ని గెట్‌మెక్‌డొనాల్డ్‌.కామ్‌లో రీడిమ్ చేసి వారికి నచ్చిన ఆహార పదార్థాలపై ఆఫర్‌ను పొందవచ్చు. ఈ సందర్భంగా కంపెనీ అధికారి రాజీవ్‌రాజన్‌ మాట్లాడుతూ...‘‘ మాహమ్మారి విజృంభణ వేళ వ్యాక్సిన్‌ అనేది ముఖ్య ప్రక్రియ. కలిసి కట్టుగా పనిచేయడమే కాకుండా ఇతరులు సైతం టీకా పొందేలా ప్రోత్సహించే అవసరం ఎంతైనా ఉంది. వినూత్నరీతిలో ఈ గొప్పపని చేసి ప్రజలకు సాయపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’అని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని