భాగ్‌ మానవా భాగ్‌..! - covid 19 patients with sedentary habits more likely to die
close
Updated : 14/04/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాగ్‌ మానవా భాగ్‌..!

 కొవిడ్‌ సమస్యల నుంచి తప్పించుకోవడానికి శారీరక శ్రమే మార్గం

పారిస్‌: వ్యాయామం అలావాటు లేని వారు కొవిడ్‌ బారిన పడితే తీవ్రమైన లక్షణాలు సంక్రమించే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డియాగో  50 వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు ‘బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌’ నివేదికలో పేర్కొంది. వృద్దులు, అవయవ మార్పిడి జరిగిన వారి తర్వాత అత్యధికంగా కొవిడ్‌ దుష్ప్రభావాలను చవిచూస్తోంది శారీరక శ్రమలేని వారే అని తేలింది. అంతేకాదు పొగతాగే అలవాటు, ఊబకాయం, హైపర్‌ టెన్షన్‌ వంటివి ఉన్నవారి కన్నా.. వీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది.

కొవిడ్‌-19 ముఖ్యంగా మగవారు, వృద్ధులు, డయాబెటిక్‌, ఊబకాయం లేదా గుండెజబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుసు. శారీరక శ్రమ లేకపోవడాన్ని ఇప్పటి వరకు రిస్క్‌ జాబితాలో చేర్చలేదు. శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌, హాస్పిటలైజేషన్‌, ఐసీయూ పాలవ్వడం , మరణం వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువ. అమెరికాలో 2020 జనవరి నుంచి అక్టోబర్‌ మధ్య కొవిడ్‌ బారిన పడిన 48,440 మందిపై పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని గుర్తించారు. ఈ సర్వే కోసం ఎంపిక చేసిన పేషెంట్ల సగటు వయస్సు 47ఏళ్లు ఉండేట్లు చూశారు. ప్రతి ఐదుగురు రోగుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. వీరి బీఎంఐ 31శాతానికి పైగా ఉంది. ఈ మొత్తం దాటితే ఊబకాయంగా పరిగణిస్తారు.

ఈ పేషెంట్లలో సగం మందికి ముందస్తుగా హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, కేన్సర్‌ వంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇక 20 శాతం మందికి ఒక సమస్య ఉండగా.. మరో 30 శాతం మందికి రెండు సమస్యలు ఉన్నాయి. ఇక మార్చి 2018 నుంచి మార్చి 2020 మధ్య వారి శారీరక శ్రమ సగటు సమయాన్ని నమోదు చేశారు. వీరిలో 15శాతం మంది వారానికి కేవలం 10 నిమిషాల్లోపు శారీరక శ్రమపడుతున్నట్లు వెల్లడించారు. 80శాతం మంది వారానికి 11 నిమిషాల నుంచి 149 నిమిషాలపాటు శారీరక శ్రమ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన వారు 150 నిమిషాలు అంతకంటే ఎక్కువ శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.

వయస్సు, ముందస్తు ఆరోగ్య సమస్యలు ఉండటం, శారీరక శ్రమ లేనివారు రెండింతలు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్నట్లు తేలింది. ఇక ఆస్పత్రి పాలైన సాధారణ రోగులతో పోలిస్తే 73శాతం అదనంగా వీరు ఐసీయూల్లో చేరారు. వీరిలో మృత్యువాత పడేవారి శాతం 2.5రెట్లు ఎక్కువగా ఉంది.

ఎంతో కొంత వ్యాయామం చేసే వారికంటే సోమరిగా ఉండేవారే 20శాతం అదనంగా ఆస్పత్రి పాలవుతున్నారు. 10శాతం అదనంగా ఐసీయూలో చేరుతున్నారు. 32శాతం అదనంగా  ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సర్వే కేవలం అంకెల ఆధారంగా పరిశీలించి చేశారు. సైన్స్‌పరంగా ప్రత్యక్ష సంబంధం లేదని  అమెరికాలోని కైజర్‌ పర్మినెంట్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని