కొవిడ్‌ వ్యాక్సిన్‌: ఏడాది చివరికి వస్తే అద్భుతమే - covid 19 vaccine may be not ready in this year
close
Published : 23/08/2020 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వ్యాక్సిన్‌: ఏడాది చివరికి వస్తే అద్భుతమే

సమయం పట్టే అవకాశం ఉందన్న ఇంగ్లాండ్‌ చీఫ్‌ వైద్యాధికారి

లండన్‌: ప్రపంచమంతా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా... అని ఎదురు చూస్తుంటే ఇంగ్లాండ్‌ ముఖ్య వైద్యాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది కూడా సిద్ధం కాకపోవచ్చని చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ విట్టే చెప్పారు.  ఈ ఏడాది క్రిస్మస్‌ నాటికి ఏ ఒక్క వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా అద్భుతమేనని వ్యాఖ్యానించారు. రాబోయే శీతాకాలంలో  కొవిడ్‌ వల్ల వచ్చే అసలైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే శీతాకాలం నాటికి వ్యాక్సిన్‌ వస్తుందనే ఆశతో ప్రణాళికలు వేసుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదన్నారు. 

‘‘వ్యాక్సిన్‌ వస్తే ఎంతో సంతోషిస్తా. అయితే పెద్ద సంఖ్యలో జనాభాకు అందించేందుకు ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ ఈ శీతాకాలం లోపు వస్తే ఆశ్చర్యకరమే. ఇది ఇప్పుడు తప్పుడు వాదన కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. చాలా మంది శాస్త్రీయంగా, లాజిస్టిక్‌గా ఇది నిరాశావాద ప్రకటన అని అనుకోవచ్చు. వ్యాక్సిన్‌ అత్యంత వేగంగా తయారు చేశాక అది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలి. సురక్షితమని నిర్ధారించుకోవడానికి సమయం పడుతుంది. వ్యాక్సిన్‌ తయారీలో ఆరు నెలల కంటే సంవత్సరం పాటు ఆగితే మెరుగైన అవకాశాలు కనిపిస్తాయి. మనకు వ్యాక్సిన్‌ రాదనే ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలి. ఒకవేళ ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి అది సురక్షితమని నిరూపితమైతే మనం బలమైన స్థితిలో ఉంటాం. ఈ మహమ్మారి నుంచి సైన్స్‌ బయటపడేస్తుందనే నమ్మకం నాకు ఉంది. అయితే ఇది కేవలం కొన్ని వారాలు, నెలల్లోనే  జరిగిపోతుందని మాత్రం నేను ఊహించలేను’’ అని ప్రొఫెసర్‌ క్రిస్‌ విట్టే వ్యాఖ్యానించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని