GHMC: కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు - covid control room re reopening in hyderabad
close
Updated : 19/04/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GHMC: కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. సోమవారం నగర పారిశుద్ధ్య కార్యక్రమాలపై ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ.లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేది లేదు. మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తిస్థాయిలో చెత్తను తొలగించాలి. అంటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలి. నగరంలో చెత్త తొలగింపు అనేది ప్రాథమిక విధి. కరోనా పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. డిప్యూటీ కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓలు రోజూ ఉదయం 6 గంటలలోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. నగరంలో బాధ్యతా రాహిత్యంగా రహదారులపై చెత్తవేసేవారిని గుర్తించి జరిమానా విధించాలి. జీహెచ్ఎంసీలో 24/7  ఈ కంట్రోల్ రూం పనిచేసే విధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలి’ అని అన్నారు. గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్‌తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు.

నగరంలో 310 ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో చెత్త నిల్వ కేంద్రాలు, 700 తక్కువ పరిమాణం గల చెత్త నిల్వ ప్రాంతాలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్ అన్నారు. వీటిలో వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రోజూ ఉదయం 5 గంటలలోపే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించేలా తనిఖీలు చేస్తున్నామన్నారు. పెద్ద పరిమాణంలో చెత్త వచ్చే ప్రాంతాలపై ఎస్.ఎఫ్.ఏ.లను నియమించి, ఎక్కడి నుండి ఆ చెత్త వస్తుందో, ఎవరు వేస్తున్నారన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

మరోవైపు నగరంలో రద్దీగా ఉండగే రహదారుల వెంట సోమవారం డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హైడ్రో క్లోరైడ్‌ ద్రావణం చల్లారు. ఖైరతాబాద్‌ నుంచి ఎర్రగడ్డ, బంజారాహిల్స్‌ రోడ్ల వెంట డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ సిబ్బంది ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా ద్రావణం చల్లారు. వైరస్‌ గాల్లో కూడా వ్యాపిస్తున్నట్టు తేలటంతో రద్దీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమం చేపట్టింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని